| Daily భారత్
Logo




తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”

News

Posted on 2026-05-11 03:50:06

Share: Share


తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”

డైలీ భారత్, హైదరాబాద్/ సిరిసిల్ల: హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ (TPA) ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్‌గా, సైకాలజిస్ట్‌గా సేవలందిస్తున్న డాక్టర్ యెలగొండ ఆంజనేయులు కి “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026” ప్రదానం చేయబడింది.

సైకాలజీ రంగంలో దాదాపు పదేళ్లపాటు విశేష సేవలు అందించినందుకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేశారు. ఈ అవార్డును TPA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచందర్ ఆధ్వర్యంలో, మాజీ గవర్నర్ మరియు కేంద్ర మంత్రిగా, వివిధ హోదాల్లో సేవలందించిన బండారు దత్తాత్రేయ మరియు మాజీ జాతీయ మహిళా కమిషన్ శ్రీమతి త్రిపురాణ వెంకట రత్నం గార్ల చేతుల మీదుగా ప్రదానం చేయడం విశేషంగా నిలిచింది.

ఈ అవార్డు అందుకోవడం పట్ల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి, తోటి సైకాలజిస్ట్లు, అధ్యాపకులు, మిత్రులు, మేధావులు, ప్రముఖులు, విద్యావేత్తలు మరియు పలువురు అభినందనలు తెలియజేశారు. డా. ఆంజనేయులు గారి సేవలు మానసిక ఆరోగ్య అవగాహనకు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి విశేషంగా దోహదపడినట్లు వారు అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని సభలో పలువురు అభిప్రాయపడ్డారు.

Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >