| Daily భారత్
Logo




నూతన బోరు మోటర్ బిగింపు

News

Posted on 2026-04-23 15:29:41

Share: Share


నూతన బోరు మోటర్ బిగింపు

లింగాయపల్లి గ్రామంలో ఐదో వార్డుకు నూతన బోర మోటర్ ఏర్పాటు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలం లింగాయపల్లి గ్రామంలోని ఐదో వార్డులో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన బోరు  ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రాజయ్య మాట్లాడుతూ, ఉప సర్పంచ్ తోట శిరీష భూపతి గారు కొత్త మోటర్ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కృషి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. కొత్త బోరు మోటర్ ఏర్పాటు వల్ల ఐదో వార్డు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శిరీష భూపతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి నవనీత, గ్రామ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >