డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: టీజీఇ జాక్ పిలుపు మేరకు నేడు మండల జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ల వద్ద మరియు తాసిల్దార్ ఆఫీస్ ల ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని కన్వీనర్ తాసిల్దార్ మారుతి రెడ్డి చైర్మన్ బోయన్న గారి నారాయణ టిఆర్టిఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి లు తెలియచేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యానుఫెస్టోలో తెలిపిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రభుత్వము వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు ఇప్పటికైనా వెన్వెంటనే స్పందించి 51% తోటి పిఆర్సి అమలు చేయాలి సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ని అమలు చేయాలి పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించుటకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో పెద్ద మొత్తంలో టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు
News
మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చాలి