| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్

విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్

డైలీ భారత్, గంభీరావుపేట: స్థానిక గంభీరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ గజానంద్ లెక్చరర్ ఇన్ హిందీ ఆధ్వర్యంలో డాక్టర్ యెలగొండ ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల గంభీరావుపేట మరియు ప్రముఖ సైకాలజిస్ట్ విద్యార్థిని విద్యార్థులకు ఎక్స్టెన్షన్ లెక్చర్ ఆన్ స్ట్రెస్ మేనేజ్మెంట్- ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. 

విద్యార్థినీ, విద్యార్థులు రాబోయే ఎగ్జామ్స్ లో ఎలాంటి మెలకువలతో ప్రిపరేషన్ సాగించాలి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఏ విధంగా రాస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది,  ఏకాగ్రతతో ఎన్నిసార్లు ఎలా చదవాలి, ఇతర ఆలోచనలతో చదువుపై ఏ విధంగా పట్టుకోల్పోతామో, అందమైన చేతిరాతను ఎలా సొంతం చేసుకోవాలి దాని ప్రయోజనాలు, అత్యుత్తమ మార్కులతో ఎలా రాణించవచ్చును తదితర విషయాలపై తగు ఉదాహరణలతో వివరి ంచారు. 

ఈ కార్యక్రమంలో పాపారావు లెక్చరర్ ఇన్ తెలుగు, జూనియర్ అసిస్టెంట్ సిహెచ్ అనిల్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్,  విద్యార్థులు తదితర అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌
Next తక్షణమే ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలి
ADVERTISEMENT