| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రిలే నిరాహార దీక్ష

రిలే నిరాహార దీక్ష

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.... రిలే నిరాహార దీక్ష

డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట తహశీల్దార్ (MRO) కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ (BJP) అశ్వారావుపేట నియోజకవర్గం నాయుకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.

మా ప్రధాన డిమాండ్లు:

అక్రమ భూ బదలాయింపులపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలి.

కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి...భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలి.

గత 30సం.రాలుగా అక్రమ భూ బదలాయింపులకు పాల్పడిన రెవెన్యూ సిబ్బంది ని గుర్తించి కఠినంగా శిక్షించాలి

ఫోర్జరీ పాస్ పుస్తకాలపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరిపించాలి

1/70యాక్ట్ ని,ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కుతూ అక్రమ పద్ధతిలో భూ హక్కులు పొందిన వారి పై చెర్యలు తీసుకోవాలి

ఇ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వర్లు,పశుమర్తి పుల్లారావు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొలిక పోగు ముసలయ్య,మాజీ జిల్లా సెక్రటరీ సీనియర్ నాయుకులు ఉడతనేని విశవేశ్వరరావు,మాజీ sc మోర్చా జిల్లా అధ్యాక్సులు గూడా ముత్యాల రావు,దొడ్డా సతీష్,పూచి ప్రసాద్,సొరకాయల సీతారాములు,కారం రత్నా కుమారి, అల్లా సుజాత మరియు భూ బాధితులు పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో IQAC - FDP
Next కామారెడ్డి లో భారీ దొంగతనం
ADVERTISEMENT