Posted on 2026-04-13 12:39:23
డైలీ భారత్, గంభీరావుపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల గంభీరావుపేట ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి విజయలక్ష్మి అధ్యక్షతన ఐక్యుఎసి ఆధ్వర్యంలో వెబినార్ ఎఫ్ డి పి (ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం) ఎన్హాన్షింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ స్కిల్స్ యూజింగ్ ఏఐ అనే అంశం పైన ఐపిఈ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్) హైదరాబాద్ తో కుదుర్చుకున్న కొలబరేషన్ లో భాగంగా ఈరోజు ఐపిఈ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసమూర్తి మరియు రామకృష్ణ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ ముఖ్య వక్తగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు టీచింగ్ నైపుణ్యాలను ఎలా సులభతరంగా బోధించవచ్చునని రకరకాల ఉదాహరణలతో సుమారు 100 మంది పైన ఆన్లైన్లో హాజరైన వారికి వివరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ ఏ ఐ అనేది మన నిత్యజీవితంలో అత్యంత శక్తివంతమైనదనీ, అభివృద్ధి పథాన పయనించవచ్చుననీ, అభివర్ణిస్తూ రాబోవు కాలాన్ని శాసించే విధంగా పోటీ ప్రపంచంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ లోకమంతా ఏఐ పైన అవగాహన కలిగి ఉండాలని ఆశించారు.
ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా కృషి చేసినందుకు డాక్టర్ వై. ఆంజనేయులు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ &ఐక్యూఏసి కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి. విజయలక్ష్మి గారికి ముఖ్య వ్యక్తులకు ఐపిఈ మేనేజ్మెంట్ కి ఉపాధ్యాయులకు, విద్యార్థిని విద్యార్థులకు, అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్. ప్రభాకర్ వైస్ ప్రిన్సిపల్, అధ్యాపకులు వి. వాణి, పి. ధర్మపురి, ఎ. మనోహర్, శ్రీనివాస్, భిక్మ్మయ్య, మరియు తదితర అధ్యాపక, అధ్యాపకేతర బ్బృందం విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >