Posted on 2026-04-13 07:33:05
డైలీ భారత్, ఖమ్మం: దేశవ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలోనూ రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటి నియంత్రణ కోసం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు చేపట్టిన అరైవ్ – అలైవ్ కార్యక్రమాలలో భాగంగా టౌన్ ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో నగరంలోని మిర్చి మార్కెట్ కు వచ్చే రైతులకు, ట్రాలీ డ్రైవర్లకు అవగాహన
పెంపొందించేందుకు వీలుగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రతి పౌరుడి మనసులో బలంగా నాటేందుకే అరైవ్ అలైవ్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డుపై వెళ్లేటప్పుడు మీ కోసం ఇంట్లో ఎదురుచూసే భార్యాపిల్లలను గుర్తుకు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్ సంస్కృతిని అలవాటు చేసి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, కార్లలో సీటు బెల్టులు పెట్టుకోకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వాడడం, మద్యం సేవించి నడపడం, సిగ్నల్ జంప్, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్ లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్ టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >