| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

జీజీహెచ్ లో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ వారోత్సవాల్లో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే తో కలిసి శనివారం ప్రారంభించారు. అలాగే డెడికేటెడ్ సెమీ ఐసీయూ వార్డును ప్రారంభించి.. అక్కడ అందించే సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన రోజు సందర్భంగా జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ లో ప్రారంభించామని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. డ్రగ్స్ తో కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, ఆర్ ఎంఓ డాక్టర్ సంతోష్ కుమార్, తహసీల్దార్ మహేష్ కుమార్, ఆర్ అండ్ బీ అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి
Next శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి
ADVERTISEMENT