| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

డైలీ భారత్, స్పెషల్: 

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు.... 

నవ్వుతూ నీ ఇంటికి వచ్చే ఆడపిల్ల వెనుక

నిశ్శబ్దంగా ఏడ్చిన వేల కథలుంటాయి…

అవి వినే మనసున్న చెవి ఉంటేనే తెలుస్తాయి- 

ఆడది ఆటబొమ్మ కాదురా…!


ఆడది జీతం లేకుండా పని చేసే పనిమనిషి కాదు,

ఆమె హృదయం ప్రేమ కోసం కొట్టుకునే జీవం.

తన కలలను మౌనంగా త్యాగం చేసి

నీ ఇంటి వెలుగవుతుంది…

అవి వినే మనసున్న హృదయం ఉంటేనే తెలుస్తాయి - ఆడది ఆటబొమ్మ కాదురా…!


ప్రేమతో పెంచిన కూతురిని

పెళ్లి అనే మాటతో నీ చేతిలో పెట్టేటప్పుడు

తండ్రి గుండె చీలిపోతుంది…

షోరూం లో కొనుక్కొచ్చిన వస్తువు కాదు ఆమె,

మనసున్న జీవం… ప్రేమతో పెరిగిన ప్రాణం

అని ఎవరు గ్రహీస్తారు చెప్పు..?


అమ్మ ఒడిలో పసిపాపగా పడుకొని

నాన్న చేతి వేళ్లను పట్టుకొని నడిచిన అడుగులు

ఇంటంతా నవ్వులు పూయించిన రోజులు…

ఒక పెళ్లి రోజుతో దూరమైపోతాయి.

బొమ్మలతో ఆడిన చిన్న చేతులు

ఇంటిపనుల భారాన్ని మోస్తుంటే,

నవ్వు వెనక దాచిన కన్నీరు

ఎవరు గమనిస్తారు చెప్పు…?



తన ఇంటి పేరును వదిలి

నీ ఇంటి గౌరవమవుతుంది.

నా కొడుకు నా వంశం  అని గర్వపడతావు,

కానీ ఎప్పుడైనా కూతురిలా చూసావా

కొడలి కష్టాలు ఎప్పుడైనా గ్రహించావా..?


కూతురు భవిష్యత్తు కోసం

అమ్మ కళ్లలో ఎన్నో నిద్రలేని రాత్రులు…

చిట్టి తల్లిని అత్తారింటికి పంపే రోజున 

నాన్న గుండె ఎన్నిసార్లు నిశ్శబ్దంగా ఏడ్చిందో

గ్రహించావా..?


ప్రేమతో పెంచిన కూతురిని

కన్నీటి హారంగా పంపే ఈ సంప్రదాయం మనకు ఎందుకు?


సమాజ కట్టుబాటుల ఆచారాలతో

ప్రేమతో పెంచిన కూతురిని

బలి ఇచ్చే ఈ సంప్రదాయం మనకు ఎందుకు?


తండ్రి వేళ్లను పట్టుకొని నడిచిన అడుగులు

ఇప్పుడు ఒంటరిగా ఎందుకు నడవాలి?

పుట్టింట్లో కూతురు అయిన ఆమె

అత్తింట్లో ఎందుకు కేవలం కొడలు అవుతుంది?


ఒక్కసారి ఆలోచించు సమాజంలోని కుళ్ళు ను

తొలగించి నవ సమాజ నిర్మాణానికి నాంది పలుకు.


రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Previous డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Next పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
ADVERTISEMENT