Posted on 2026-04-11 16:25:00
వ్యకాస జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ డిమాండ్.
పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 ఇవ్వాలి
వ్యకాస సంఘం వైరా డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ
డైలీ భారత్, వైరా: కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ మహాసభ స్థానిక బోడెపూడి భవనంలో కిన్నెర మోతీర అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాకా గ్రామీణ పేదలకు, పట్టణ పేదలకు ఉపయోగపడుతున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని రద్దుచేసి విబిజి రాంజీ బిల్లు తెచ్చి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందని విమర్శించారు. పని హక్కుగా ఉన్న చట్టాన్ని రద్దు చేసి పథకం రూపంలో తెచ్చిన బిల్లుతో వ్యవసాయ కూలీలు, పేదలకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో కేరళ తరహాలో ఉపాధి పనిని ప్రవేశపెట్టాలని, సంవత్సరంలో 150 రోజులు పని కల్పించాలని, రోజు కూలీ 600 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక రద్దు చేసిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, వీబీజీ రాంజీ బిల్లును తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధికి 90 శాతం నిధులు కేటాయించే వారిని, నేడు దానిని 60 శాతానికి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం భరించాలని బిజెపి ప్రభుత్వం పేర్కొన్న బిల్లును పార్లమెంట్ ఆమోదించటం అన్యాయమని అన్నారు. మోడీ అంతర్జాతీయ విషయాల్లో అవలంబిస్తున్న విధానాలు, యుద్ధాన్ని ఖండించకుండా మౌన మునిగా ఉండటం వల్ల భారత దేశంలోని ప్రజల మీద కూడా భారం పడుతుందని అన్నారు. ప్రజా ఉద్యమాలను కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా, రాష్ట్ర, దేశ మహాసభల్లో చర్చించి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని, ప్రజలందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సంఘం వైరా డివిజన్ అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర, కేంద్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా కుల విభజన, రెండు పూటలా ఫోటో సిస్టం, డ్రోన్ సిస్టం, కఠినమైన నిబంధనలు తెచ్చిందని వీటన్నింటినీ రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గ్రామీణ పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని వెంటనే అమలు చేయాలని కోరారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ ఆసరా, వితంతు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని, హామీ ప్రకారం 4,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు.
వ్యకాస వైరా పట్టణ నూతన కమిటీ ఎన్నిక అధ్యక్ష, కార్యదర్శులుగా తాటి ఏసు, గుమ్మా నరసింహారావు
అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం వైరా పట్టణ అధ్యక్షులుగా తాటి ఏసు, కార్యదర్శిగా గుమ్మా నరసింహారావు, ఉపాధ్యాయులుగా ఓర్సు సీతారాములు, సహాయ కార్యదర్శిగా చిత్తారు మురళి తోపాటు మరో 12 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గొడ్ల లక్ష్మి నారాయణ, కాండ్ర అమృతమ్మ, బండి శ్రీనివాసరావు, వల్లపు ఏడుకొండలు, ఏరువ నరసింహారావు, బండి అనసూయమ్మ, బొల్లెపోగు తిరుపతిరావు, ఐద్వా నాయకురాలు మాడపాటి సుజాత, తెలంగాణ రైతు సంఘం నాయకులు కొంగర సుధాకర్, సిఐటియూ నాయకులు సుంకర సుధాకర్, పాపగంటి రాంబాబు, అమరనేని కృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు షేక్ నాగుల్ పాషా, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, సోషల్ మీడియా వైరా డివిజన్ కన్వీనర్ గుడిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >