| Daily భారత్
Logo




గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

News

Posted on 2026-04-11 12:50:14

Share: Share


గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించడం గర్వకారణం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

సమన్వయంతోనే జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డులు – వైద్య శాఖకు కలెక్టర్ అభినందనలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా వైద్య విధానం పరిషత్ ఆసుపత్రుల సిబ్బందికి ప్రశంస పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శనివారం పాల్వంచ పెద్దమ్మ గుడి సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ముఖ్య అతిథిగా హాజరై, వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసి వారి సేవలను ప్రశంసించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంగా ఉన్న జిల్లాలో నాణ్యమైన వైద్య సేవలను అందించడం సవాలుతో కూడుకున్నదైనా, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో వైద్య శాఖ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

గతంలో మారుమూల గ్రామాలకు రహదారి, కమ్యూనికేషన్ సదుపాయాల లోపంతో వైద్య సేవలు అందించడంలో సమస్యలు ఎదురయ్యాయని, ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చర్ల, గుండాల వంటి ప్రాంతాల్లో కూడా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. టెలీమెడిసిన్, డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ వైద్య సేవల ద్వారా ప్రజలకు సమయానికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.

ఈ విజయానికి ఆశా కార్యకర్తల నుండి ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్యులు, జిల్లా స్థాయి అధికారుల వరకు అందరి సమన్వయం కారణమని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించడం వల్లనే జిల్లాకు రాష్ట్ర స్థాయిలో అవార్డులు లభించాయని పేర్కొన్నారు.

జిల్లా వైద్య శాఖ ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి, రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందేలా కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, ప్రతి గిరిజన ప్రాంతానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైద్య సేవలపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యమని, సేవా భావంతో పనిచేసే సిబ్బంది వల్లే అది సాధ్యమవుతుందని తెలిపారు. వచ్చే సంవత్సరంలో మరిన్ని ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాలని వైద్య సిబ్బందిని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో డిసిహెచ్ రవిబాబు, తాసిల్దార్ రంగప్రసాద్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యులు, నర్సులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

#BhadradriKothagudem #Healthcare #TribalHealth #Telangana #PublicHealth

Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >