Posted on 2026-04-11 05:21:32
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించే లక్ష్యంతో, సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు వద్ద కొత్తగా 33/11కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శుక్రవారం తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ అనుమతులు మంజూరు చేసిందని రాజన్న సిరిసిల్ల సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి తెలిపారు. ఈ సందర్బంగా బిక్షపతి మాట్లాడుతూ.. ఈ సబ్‌స్టేషన్ నిర్మాణానికి మొత్తం రూ. 2,81,48,000/- (రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు) నిధులు కేటాయించారు. ఈ కేంద్రంలో 1x5.0 ఎంవిఏ సామర్థ్యం కలిగిన పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయనున్నారు. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించడానికి ఈ సబ్‌స్టేషన్ నుండి 4 కొత్త 11కేవీ ఫీడర్లను (ఫీడర్-1, 2, 3, 4) నిర్మించనున్నారు. సిరిసిల్ల కలెక్టరేట్ బైపాస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో రోజురోజుకూ విద్యుత్ డిమాండ్ , లోడ్ విపరీతంగా పెరుగుతోంది. క్షేత్రస్థాయి అధికారుల నివేదికల ఆధారంగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ఈ తెలిపారు.
ఈ కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా సిరిసిల్ల మండలంలోని వేలాది మంది వినియోగదారులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుందని తెలిపారు.
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >