| Daily భారత్
Logo




మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

News

Posted on 2026-04-05 17:45:37

Share: Share


మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలి – జిల్లా కలెక్టర్ అంకిత్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డా. బాబూ జగ్జీవన్ రామ్  119వ జయంతి వేడుకలను జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్‌లోని భద్రాద్రి కొత్తగూడెం క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి, డా. బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, డా. బాబూ జగ్జీవన్ రామ్ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించి, సామాజిక న్యాయ సాధనకు కృషి చేసిన మహానేత అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వంలో అనేక శాఖలకు మంత్రిగా సేవలందించడమే కాకుండా, దేశ ఉప ప్రధానిగా కూడా సమర్థవంతంగా పనిచేసి ప్రజాసేవకు అంకితభావంతో నిలిచారని తెలిపారు.

మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజంలో వివక్ష లేకుండా సమానత్వంతో ముందుకు సాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ వేణు గోపాల్, కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నాయకులు ఎస్.కె. సాబీర్ పాషా, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి ఎం. శ్రీలత, జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ దాసరి శ్రీనివాస్, కో-కన్వీనర్లు చదలవాడ సూరి, కూసపాటి శ్రీనివాస్, మంద హనుమంతు, మద్దెల శివకుమార్, దాసరి సారథి. మధుబాబు. దాసరి చక్రి దాసరి సంధ్య.. రవి. మొగిలి. తదితరులు పాల్గొన్నారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >