| Daily భారత్
Logo




శీర్షిక: మనసు ఎక్కడ పోయింది?

News

Posted on 2026-04-03 19:03:07

Share: Share


శీర్షిక: మనసు ఎక్కడ పోయింది?

మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్: 

శీర్షిక: మనసు ఎక్కడ పోయింది?

పొద్దున్నే మోగింది అలారం…

కానీ లేచేది మనసు కాదు,

ఫోన్ స్క్రీన్ వెలుగే ముందుగా

కళ్లలో ఉదయాన్ని నింపుతోంది…

వేల కాంటాక్టులు ఫోన్‌లో ఉన్నా

ఒక మనసు మాత్రం కాల్ చేయదు –

“ఎలా ఉన్నావు?” అని అడిగే

ఆ ఆత్మీయ స్వరం మాయమైంది…

ఇంటి గోడలు పెరిగాయి,

కానీ గది నవ్వులు తగ్గాయి…

డైనింగ్ టేబుల్ పెద్దదైంది,

కానీ కలిసి తినే మనుషులు చిన్నబడ్డారు…

సెల్ఫీలు వేలకొద్దీ,

కానీ సంతోషం ఒక్కటే లేదు…

సోషల్ మీడియాలో చిరునవ్వు,

జీవితంలో మాత్రం నిశ్శబ్దం…

బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది,

కానీ నిద్ర తగ్గుతోంది…

పదవులు ఎక్కుతున్నాం,

కానీ శాంతి దిగిపోతోంది…

ఒక రోజు…

అద్దంలో మనమే మనల్ని అడిగాం –

“ఇంత పరుగెత్తింది ఎవరి కోసం?”

జవాబు రాకపోయినా,

కళ్లలో నీళ్లు వచ్చాయి…

ఆ రోజు తెలిసింది –

డబ్బు జీవితం కాదు…

మనుషులే జీవితం…

మనసే నిజమైన సంపద…


రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >