Posted on 2026-03-31 13:42:14
మెరుగైన చికిత్స కోసం ముగ్గురిని విజయవాడ తరలించాము
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
డైలీ భారత్, కృష్ణా జిల్లా: గతేడాది అక్టోబరు నెలలో అక్రమంగా టపాసులు నిల్వ ఉంచిన వారి దగ్గర నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నామని, వాటిని మంగళవారం కోర్టులో సబ్మిట్ చేయటానికి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసిన క్రమంలో పేలినట్లు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మంగళవారం చల్లపల్లి పోలీస్ స్టేషన్లో టపాసులు పేలి ఐదుగురికి గాయాలు కావటంతో సంఘటనా ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీజ్ చేసిన టపాసులను కోర్టులో సబ్మిట్ చేసే క్రమంలో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లా, డ్రైవర్ నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. అదేవిధంగా ఎస్ఐ దుర్గాంజనేయులుకు స్వల్ప గాయాలు కాగా, ముగ్గురిని విజయవాడ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ పార్వతీ, హెడ్ కానిస్టేబుల్ తేజ చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. సీజ్ చేసిన టపాకాయలు స్టేషన్ కు దూరంగా ఉంచటం జరిగిందని, కోర్టు ఆర్డర్స్ రావటంతో వాటిని కోర్టులో సబ్మిట్ చేయటానికి తీసిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాదమికంగా నిర్ధారించటం జరిగిందన్నారు. రాష్ట్ర హోం మంత్రి వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత లు తీసుకుంటామని తెలిపారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >