Posted on 2026-03-31 12:53:12
• ర్యాలీ రూట్ మ్యాప్ పరిశీలన – అధికారులకు కీలక ఆదేశాలు
• శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి.
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా : ఏప్రిల్ 02న హనుమాన్ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలో నిర్వహించనున్న శోభాయాత్ర మార్గం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, IAS , జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మంగళవారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమీక్షించారు.
ర్యాలీ సజావుగా, శాంతియుత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులతో చర్చించి పలు కీలక సూచనలు చేశారు. వివిధ శాఖల అధికారులతో కలిసి ర్యాలీ సాగే రూట్ మ్యాప్‌ను పరిశీలించిన వారు, మార్గంలోని ప్రధాన కూడళ్ల ను సందర్శించి ట్రాఫిక్ నియంత్రణ , బందోబస్తు ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు.
అనంతరం ర్యాలీ నిర్వహణ ప్రతినిధులతో కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి, వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ లు మాట్లాడుతూ, పట్టణంలోని ముఖ్య మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలు , సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.
ఇతరులకు ఇబ్బంది కలగకుండా భక్తులు , నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి ఈ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, IPS, ఎస్.హెచ్.ఓ నరహరి, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మధుసూధన్ , ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >