| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

శ్రీరామనవమి సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు

శ్రీరామనవమి సందర్భంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు

జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మరియు బాన్సువాడ పట్టణాల్లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని విస్తృత స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపిఎస్ తెలిపారు. భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా పండుగను జరుపుకునేలా అన్ని కీలక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందిని మోహరించడం జరిగింది.

పట్టణాల ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా సర్వే లెన్స్  30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎల్ఈడి స్క్రీన్ వ్యాన్ పై , డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నదని ఎస్పీ పేర్కొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జిల్లా ఎస్పీ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేశారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మతసామరస్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది అని మరొక్కసారి గుర్తు చేశారు

Previous భద్రాదిలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం!
Next కళాకారులు దేవుని రూపాలు : మంజుల పత్తిపాటి
ADVERTISEMENT