| Daily భారత్
Logo




మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు...

News

Posted on 2026-03-23 14:30:13

Share: Share


మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు...

జిల్లాలో ఒకే రోజు 105 మందికి కోర్టు శిక్షలు

05 మందికి రెండు రోజు జైలు శిక్ష, 9 మందికి ఒక  రోజు జైలు శిక్ష,  రూ.1,27,500 జరిమానా విధింపు

మీ భద్రతే మా లక్ష్యం.. మద్యం మత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయం – జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు 

జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడం మరియు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పెద్ద సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డారు.

వీరిలో 105 మందిని ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జరిమానాలు మరియు జైలు శిక్షలు విధించింది. 05 మందికి రెండు రోజుల జైలు శిక్ష, 9 మందికి ఒక రోజు జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి కలిపి మొత్తం రూ. 1,27,500 జరిమానా విధించడం జరిగింది. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి మరియు ఇటువంటి బాధ్యతారాహిత్యపు పనులను అరికట్టడానికి పోలీస్ శాఖ ఈ కఠిన చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనం నడపడం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా, తోటి ప్రయాణికుల మరియు పాదచారుల ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టడమేనని తీవ్రంగా హెచ్చరించారు. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనాలు నడిపి, నిండు జీవితాలను రోడ్డు ప్రమాదాల పాలు చేసుకోవద్దని ఆయన వాహనదారులకు సూచించారు. ఒక వ్యక్తి చేసే ఈ చిన్న పొరపాటు వల్ల ఎన్నో కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

"మీ భద్రతే మా లక్ష్యం" అని పేర్కొన్న ఎస్పీ గారు, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన ప్రయాణమే మీ కుటుంబ భవిష్యత్తుకు అసలైన భరోసా అని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి రోడ్డు రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >
Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >