Posted on 2026-03-21 07:13:34
వీధిన పడ్డ కుటుంబానికి న్యాయం చేయాలి...
బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
13 రోజులుగా "ప్రతిమ" ప్రాజెక్టు గేటు వద్దే బాధితుల దీక్ష...అధికారులకు చలనం లేదు
రెండు నెలలు అవుతున్న అందని పరిహారం.. ఎమ్మెల్యే హామీ ఏమైందని ప్రశ్న
మృతుని కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం సీతారామ ప్రాజెక్టు వద్ద నిరాహార దీక్ష చేస్తున్న మృతిని కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,వారు మాట్లాడుతూ పూసుగూడెం వద్ద పనులు నిర్వహిస్తున్న ‘ప్రతిమ ప్రాజెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ మరణించిన జంపయ్య కుటుంబానికి నేటికీ న్యాయం జరగలేదు,విధి నిర్వహణలో ఉండగా అనుమానాస్పద స్థితిలో మరణించి రెండు నెలలు కావస్తున్నా,అటు అధికారులు కానీ,కాంట్రాక్టర్ కానీ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం లేదని,తమకు న్యాయం చేయాలంటూ గత 13రోజులుగా ప్రాజెక్టు ప్రధాన గేటు వద్దే టెంట్ వేసుకొని నిరసన తెలుపుతున్నా యాజమాన్యం స్పందించకపోవడంపై పలు అనుమానాలకు దారి తీస్తుందని,జంపయ్య మరణించిన సమయంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు సంబంధిత అధికారులు వచ్చి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని..న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని,ఆ నమ్మకంతోనే అప్పట్లో కుటుంబ సభ్యులు శాంతించారు,తీరా రెండు నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు,గత 8 ఏళ్లకు పైగా ఇక్కడే నమ్మకంగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు,వారిది అత్యంత నిరుపేద కుటుంబం ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయినారు,కంపెనీ యాజమాన్యం వెంటనే స్పందించి ఆ కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని,లేని పక్షంలో అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు,ఇ కార్యక్రమం లో బీజేపీ నియోజకవర్గం నాయుకులు తంబళ్ల రవి,సీనియర్ నాయుకులు గూడా ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >