Posted on 2026-03-21 07:08:50
రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రంజాన్ పండుగ సందర్భంగా షాద్ నగర్ ఈద్గా వద్ద మైనారిటీ సోదరులను కలుసుకుని రంజాన్ పండుగ ముబారక్ తెలుపుతున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ రంజాన్ నెలలో ఉపవాసదీక్షలు, ప్రార్థనలు మనసును పవిత్రం చేసుకోవడానికి, మంచి మార్గంలో నడవడానికి, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడానికి ఒక మంచి అవకాశం. పేదలకు దానం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం పెరుగుతుంది. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లాహ్ ఆశీస్సులు లభించి, మీ కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటూ..రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >