Posted on 2026-03-21 04:01:06
డైలీ భారత్, హైదరాబాద్ : హుక్కా సెంటర్లే లక్ష్యంగా ఎల్బీనగర్ ఏసీపీ కృష్ణయ్య మెరుపు దాడులు నిర్వహించారు. నాగోల్,ఎల్బీనగర్ పరిధిలోని హుక్కా సెంటర్లపై జరిగిన ఈ దాడుల్లో భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, మొత్తం 37 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో ఉన్న సేహరి కేఫె హుక్కా సెంటర్ పై ఏసీపీ కృష్ణయ్య తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేశారు. స్థానిక నాగోల్ సీఐకి కూడా సమాచారం లేకుండా నేరుగా రంగంలోకి దిగిన ఏసీపీ, అక్కడ హుక్కా సేవిస్తున్న 25 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఎల్బీనగర్‌లోని "ఎల్వోసి" హుక్కా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా హుక్కా నిర్వహిస్తున్నట్లు గుర్తించి, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణయ్య మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.అదుపులోకి తీసుకున్న యువకుల నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు, నివేదిక ఆధారంగా తదుపరి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.మూడు రోజుల క్రితం జరిగిన దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక సెక్టార్ ఎస్ఐకి ఇప్పటికే ఛార్జ్ మెమో జారీ చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, నిబంధనలు ఉల్లంఘించి హుక్కా సెంటర్లు నడిపినా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >