Posted on 2026-03-19 17:26:01
సిబ్బందిని అభినందించిన కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పోలీసులు భారీ గంజాయి స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. సుమారు 105.54 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు, దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 52,77,000/- ఉంటుందని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు.
ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసులు రెండు కార్లు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని కలిమెల, డొంకరాయి ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి, భద్రాచలం, పాల్వంచ మీదుగా హైదరాబాద్‌కు తరలించి విక్రయించాలని ప్లాన్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.
గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం సబ్ డివిజన్ డీఎస్పీ ఆదినారాయణ హెచ్చరించారు.ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు, జూలూరుపాడు ఎస్సై బాదావత్ రవి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >