| Daily భారత్
Logo




ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2026-03-19 14:20:54

Share: Share


ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా చైర్మన్  మాట్లాడుతూ ఉగాది పండుగ కొత్త ఆరంభాలకు ప్రతీక అని, ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు, విజయాలు తీసుకురావాలని కోరుకున్నారు. ముఖ్యంగా రైతులు సుభిక్షంగా ఉండటం రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

రైతులకు ఆధునిక సాంకేతికత, నీటి వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఆయన వివరించారు. పంటల ఉత్పాదకత పెంపుతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.ఈ కొత్త సంవత్సరంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందిస్తూ అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.ఉగాది పర్వదినం తెలంగాణ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, ఐశ్వర్యాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు.

Image 1

నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

Posted On 2026-09-10 15:22:16

Readmore >
Image 1

కామారెడ్డిలో రైస్ మిల్లర్ల మహా ధర్నా విజయవంతం...

Posted On 2026-09-10 15:19:28

Readmore >
Image 1

CMRF ద్వారా లక్ష్మణ్‌కు రూ.19,000 ఆర్థిక సహాయం

Posted On 2026-09-10 09:43:29

Readmore >
Image 1

ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం

Posted On 2026-09-10 07:03:46

Readmore >
Image 1

వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్

Posted On 2026-09-10 07:02:32

Readmore >
Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >