Posted on 2026-03-16 13:30:32
ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మహనీయునికి నివాళులు
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్
డైలీ భారత్, కామారెడ్డి: త్యాగానికి సమర్పణ భావనకు నిదర్శనమే పొట్టి శ్రీరాములు గారిని,తెలుగు జాతి ఐక్యత కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి ప్రాణత్యాగం చేయడం తెలుగు జాతి పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్ అన్నారు.
పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఐవిఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్యవైశ్య జాతిలో జన్మించి తెలుగుజాతి ప్రజల కోసం ఆత్మ బలిదానం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తియే పొట్టి శ్రీరాములు గారిని వారిని పూర్తిగా తీసుకుని ఆర్యవైశ్యులందరూ ఐక్యమత్యంతో సమాజం కోసం ముందుకు వెళ్లాలని అన్నారు. ఆర్థికంగా వైశ్య సమాజం ముందంజలో ఉన్న రాజకీయంగా సమాజంలో వెనుకబడి ఉండడం జరిగిందని ఆ వెనకబాటు పోవాలంటే ఆర్యవైశ్యులు ఐక్యత ఎంతో ముఖ్యమని అన్నారు.వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న, ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్, సుదర్శన్,కోశాధికారి నంగునూరి కాశీనాథం,జిల్లా ఉపాధ్యక్షులు కొత్త బీమ్ రాజ్ మందుల రామచంద్రం,కోవూరీ భూమేష్,పార్శి కృష్ణమూర్తి,సోమిశెట్టి ఆంజనేయులు,ఐవిఎఫ్ సభ్యులు పాల్గొనడం జరిగింది.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >