| Daily భారత్
Logo




ఇప్పలగుంపు గ్రామ రహదారిపై కూలిన వంతెన పునర్నిర్మాణం చేయాలని ప్రజావాణిలో వినతి

News

Posted on 2026-03-16 12:34:46

Share: Share


ఇప్పలగుంపు గ్రామ రహదారిపై కూలిన వంతెన పునర్నిర్మాణం చేయాలని ప్రజావాణిలో వినతి

డైలీ భారత్, మణుగూరు: మణుగూరు మండలం పగడేరు గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై కూలిపోయిన వంతెనను పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ప్రజాదర్భ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజుకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ, తమ గ్రామంలో సుమారు 80 గిరిజన కుటుంబాలు గత 50 సంవత్సరాలుగా నివసిస్తూ పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పలగుంపు గ్రామం నుంచి పగడేరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి తమకు ఏకైక రవాణా మార్గమని చెప్పారు. ఈ మార్గం ద్వారానే పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడం జరుగుతుందని, అలాగే గ్రామస్తులు నిత్యావసర వస్తువుల కొనుగోలు మరియు అత్యవసర వైద్య సేవల కోసం ఇదే రహదారిని వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.

గతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారిపై ఉన్న వంతెన తీవ్రంగా దెబ్బతిని కుంగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం ఆ వంతెన రోజురోజుకు మరింత కూలిపోతూ ప్రమాదకరంగా మారిందని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో వంతెన పూర్తిగా కూలిపోయే అవకాశం ఉండడంతో గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధం కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి ఇప్పలగుంపు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెనను అత్యవసరంగా పునర్నిర్మాణం చేయాలని గ్రామస్థులు కోరారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >