Posted on 2026-03-16 04:02:23
డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రజా ఐక్యత గీతం
పర్వత శిఖరములపై పలికిన కవితా నాదమది
పృథ్వీ గర్భమంతట పరిమళించి విరజిల్లె;
భాషల గోడలన్నియు భగ్నమగునని బోధించి
భావాల సేతువై మానవ హృదయములను కలిపె.
కులమత భేదముల కలుషిత చీకటిలో
కరుణా కాంతిరేఖలై కవిత వెలుగె;
విభేద వలయముల విరిచి సమత్వ మార్గమున
సామరస్య సుగంధమై సమాజమున పరచె.
పేదవాని నిశ్వాసము, ధనవాని గర్వగీతము
ఒకే రాగమై కలిసిన క్షణమున
సమానత్వ సత్యమై సమాజ గర్భమందు
స్నేహ స్వరమై సర్వలోకమున మార్మోగె.
సరిహద్దు రేఖలతో భూమిని చీల్చిన చేతులకన్నా
స్నేహసూత్రమే శాశ్వతమని కాలమే చెప్తుంది;
మనసుల నదులన్నియు ఒకే సముద్రమై చేరగా
మానవత్వమే జగతికి మహాసంగీతమవుతుంది.
కావున కవిత కేవలం పదాల అలంకారముకాదు—
ప్రజల హృదయాలను కలిపే పవిత్ర జ్యోతి అది;
ప్రపంచ కవితా స్వరమై మార్మోగిన వేళ
ప్రజల ఐక్యత రాగమే భూమికి శాశ్వత గీతమవుతుంది.
రచన: మంజుల పత్తిపాటి
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >