| Daily భారత్
Logo




శీర్షిక: ప్రకృతి గర్భగుడి

News

Posted on 2026-03-11 11:28:37

Share: Share


శీర్షిక: ప్రకృతి గర్భగుడి

డైలీ భారత్ స్పెషల్: శీర్షిక: ప్రకృతి గర్భగుడి

మన హృదయం ప్రకృతి గర్భగుడిగా మారిన వేళ,

వర్షపు చినుకులు అభిషేకాలై జలజలా కురిశాయి.

గాలుల సున్నిత నాదం మంత్రోచ్ఛారణై పలికిన వేళ,

పక్షుల గానధారలు ఘంటానాదాలై మార్మోగాయి.

భూమి ఒడిలో మొలిచిన ప్రతి పచ్చ మొగ్గ,

దైవసాన్నిధ్యపు మౌన ప్రతిమగా నిలిచింది.

సూర్యకిరణాలు హారతులై వెలుగులు చిందించగా,

చంద్రకాంతి కరుణా ప్రసాదంలా జాలువారింది.

కానీ —

మనిషి మనసులో మొలిచిన స్వార్థపు ముళ్లు

ఆ ప్రకృతి గర్భగుడిని గాయపరిచాయి.

అసూయ అనే అగ్నికణం ఎగసి పడిన వేళ

హృదయ పవిత్రత బూడిదగా మారింది.

అహంకారం అనే అంధకారం కమ్ముకున్నప్పుడు

ఆత్మదీపం మసకబారింది.

ద్వేషం అనే విషగాలి వీచిన క్షణంలో

జీవన వనమే వాడిపోయింది.

అడవులను నరికిన కత్తుల ధ్వని

మనిషి ఊపిరినే మూలం నుంచి కోసేసింది.

పక్షుల గానాలు నిశ్శబ్దంలో కలిసిపోతూ

ప్రకృతి ఆలయం శూన్యంగా మారింది.

మన హృదయం మళ్లీ పవిత్రమైతేనే

ప్రకృతి గర్భగుడి తిరిగి వెలుగుతుంది.

మన ప్రేమే హారతి, మన కరుణే పూజగా మారితే

ఈ భూమి మళ్లీ దైవాలయంగా వికసిస్తుంది.

పకృతిని కాపాడాలని కోరుకుంటూ...

మంజుల పత్తిపాటి (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >