| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కరెంట్ షాక్ తో మృతి చెందిన వలస గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి

కరెంట్ షాక్ తో మృతి చెందిన వలస గిరిజన కుటుంబాన్ని ఆదుకోవాలి

బీజేపీ నాయకులు తంబల్ల రవి డిమాండ్ 

జామాయిల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలి

ప్రాణం ఖరీదు1,40,000/- లా...?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి పంచాయితీ లో నిన్న 220/11 కెవి కరెంట్ బారిన పడి మృతిచెందిన ఛత్తీస్గఢ్ వలస గిరిజన  కూలి కుటుంబాన్నీ ముళ్ళపల్లిలో పరామర్శించిన అశ్వారావుపేట బీజేపీ నాయకులు తంబళ్ల రవి,పొట్ట కూటి కోసం కూలి నిమిత్తం జమాయిల్ కటింగ్ కు వచ్చి 220/11 కేవి కరెంట్ వైరు తగిలి మృతిచెందిన వలస కూలి ఛత్తీస్గఢ్ ఆదివాసీ మడివి భద్రం కు న్యాయం చేకూర్చాలని,బాధిత కుటుంబాన్నీ పరామర్శించి మృతుడికి కాంట్రాక్టర్ నుండి తక్షణ నష్టపరిహారాన్ని మరియు వారికి ప్రమాద భీమా కూడా అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ బాధితుల తరుపున డిమాండ్ చేస్తుందనీ తెలిపారు,ప్రాణం ఖరీదు 1,40,000/- లుగా కేటాయిస్తూ పంచాయతీ చేయడం చాలా బాధాకరమని,జామాయిల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయింది వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు,కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,కొలికపోగు ముసల్య,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Previous రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లకు ప్రశంసలు, నగదు బహుమతి
Next మున్సిపల్ సిబ్బంది కోసం వాటర్ బాటిల్స్ డొనేట్ చేసిన జర్నలిస్టులు
ADVERTISEMENT