| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

షాద్‌నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం

షాద్‌నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అందే మోహన్ లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వారిని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం పలువురు ముఖ్య నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎం.డి. ఇబ్రహీం మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన నాయకులు మున్సిపల్ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని, వారి నాయకత్వంలో షాద్‌నగర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పనలో నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇసాక్, ముబారక్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous ఏసీబీకి చిక్కిన రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్
Next ఆర్థిక పునరావస సహాయానికి దివ్యాంగులకు ఇంటర్వ్యూలు
ADVERTISEMENT