Posted on 2026-02-09 20:31:57
పల్నాడు జిల్లాలో మరో అవినీతి తిమింగలం
డైలీ భారత్, చిలకలూరిపేట: : మండలంలోని చేపట్టిన పనుల తాలుకూ బిల్లుల చెల్లింపునకు లంచం డిమాండ్ చేసిన ఏఈని అవినీతి నిరోధక శాఖ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏఈ గా పనిచేస్తున్న సత్యనారాయణ సోమవారం రూ. 24 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఇటీవల చేపట్టిన నిర్మాణ పనులకు చెల్లించాల్సిన బిల్లుల కోసం ఏఈని కాంట్రాక్టర్ కలువగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో సోమవారం వ్యూహం ప్రకారం కార్యాలయంలో రూ.24 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగ నిబంధనలకు వ్యతిరేకంగా లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఏసీబీ ఉన్నతాధికారులు కోరారు.
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >