Posted on 2026-02-08 20:27:56
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా; షాద్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే సాధ్యమని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దిలీప్ కుమార్ కు మద్దతుగా ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి, దిలీప్ కుమార్ కు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం ఇబ్రహీం మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం సుమారు 1350 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించారని గుర్తు చేశారు. వార్డుల్లో కనిపిస్తున్న సిసి రోడ్లు, అత్యాధునిక అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వార్డును మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ఎమ్మెల్యే ఆశీస్సులతో దిలీప్ కుమార్ ను గెలిపించుకోవాలని ఆయన వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇసాక్,సత్తయ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >