Posted on 2026-02-07 07:25:11
పరారిలో ఉనన్న నిందితురాలు అరెస్ట్
ఏసీబీ కి చిక్కిన కొత్తగూడెం ఎఫ్ డి సి డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి
జనవరి 3 నుండీ పరారి
ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియా లో అదుపులోకి తీసుకున్న ఏసీబీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ డివిజనల్ మానేజేర్ తాటి శ్రావణి ణి ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో ఏసీబీ టీమ్ విశాఖపట్నం లో అదుపులోకి తీసుకున్నారు. రూ 28 లక్షలు డిమాండ్ చేసి, రెంజర్ రాజేందర్, మధ్యవర్తి గోపాలకృష్ణ ద్వారా 3.50లక్షలు తీసుకుంటున్న సందర్బంగా అన్నపురెడ్డిపల్లి మండలం సీతాయిగూడెంలో ఏసీబీ జనవరి 3 న పట్టుకున్నారు. టన్నుకు రూ 90 చొప్పున మొత్తం రూ 28 లక్షలు డిమాండ్ చేశారు. . రెంజర్ ను ఏసీబీ హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుండి డివిజనల్ అధికారిణి శ్రావణి పరారిలో ఉన్నారు. ఏసీబీ ఆమే పై నిఘా పెట్టి విశాఖపట్నం లో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆమే ముందస్తు బెయిల్ కు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నించారు. శ్రావణి ణి ఈ రోజు ఏసీబీ కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసు రాష్ట్ర స్థాయిలో అటవీ అభివృద్ధి సంస్థ లో సంచలనం సృష్టించింది. రాష్ట్ర బాస్ కార్యాలయం సమావేశం లో ఉండగా రెంజర్ రాజేందర్ ను ఏసీబీ అదుపులో తీసుకోవడం సంస్థ ను కుదిపేసింది
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >