| Daily భారత్
Logo




అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్.

News

Posted on 2026-02-07 04:51:31

Share: Share


అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి.- కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్.

డైలీ భారత్, తిరుపతి: నగరంలోని ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. 

నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

జరుగుతున్న పనులు, చేయాల్సిన పనుల పురోగతిపై అధికారులు కమిషనర్ కు వివరించారు. 

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ..

నగరంలో తాను పర్యటించిన సమయంలో ప్రజల నుండి చెప్పిన సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల మేరకు ప్రాధాన్యత గల పనులకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలకు అవసరమైన సి. సి. రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం, కాలువల మరమ్మత్తులకు, ప్రజా ఉపయోగకరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎదో ఇచ్చారు, చేద్దాం అని కాకుండా అధికారులు తమ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చేయాల్సిన పనులకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. 

ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, డి.ఈ. లు మహేష్, రాజు, మధు, వెంకట ప్రసాద్, లలిత, శిల్ప, రమణ, టెక్నికల్ ఆఫీసర్ రజని పాల్గొన్నారు.


#Tirupati #MCT #maud_municipal #cdma_municipal #development #apcm #NCBN

Image 1

రాజమండ్రిలో మెడికోపై తాగుబోతుల రాక్షసత్వం...

Posted On 2026-08-08 07:38:13

Readmore >
Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >