Posted on 2026-01-30 16:04:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను ఎన్నికల అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అభ్యర్థి నోడ్యూ సర్టిఫికెట్ కచ్చితంగా పొందాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఆస్తిపన్ను పూర్తిగా చెల్లించినట్లు ధ్రువపత్రాన్ని అందజేస్తారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో ఓ అభ్యర్థి ఏకంగా రూ. 7.42 కోట్లకు పైగా మున్సిపల్ పన్ను బకాయిలు చెల్లించారు. అనంతరం నేడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ అంశం నగరంలోని తీవ్ర చర్చనీయాశంగా మారింది. మున్సిపల్ కార్పొరేషన్‌కు పోటీచేసే అభ్యర్థులు వందల్లో ఉండడంతో మున్సిపల్ కార్యాలయానికి గత మూడు రోజులుగా వరుస కట్టారు. పలువురు ఆశావహులు నోడ్యూ సర్టిఫికెట్ పొందేందుకు బారులు తీరారు. ఇన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలు ఎన్నికల నిబంధనల కారణంగా క్లియర్ అవుతున్నాయని ఓ అధికారి పేర్కొన్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పన్ను సైతం తప్పనిసరిగా కట్టాల్సి వస్తుండడంతో అభ్యర్థులు సైతం ఏం చేయలేక బకాయిలు కట్టే పనిలో పడ్డారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >