Posted on 2026-01-30 10:08:19
1 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి భోజన్న
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా చివరి రోజు మూడో డివిజన్ పరిధిలోని గూపన్ పల్లి నామినేషన్ కేంద్రంలో శుక్రవారం 1 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భోజన్న నామినేషన్ దాఖలు వేశారు. నామినేషన్ దాఖలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆదేశాలు మేరకు నామినేషన్ దాఖలు వేయడం జరిగిందని ఆయన అన్నారు. అలాగే ఖానాపూర్, కాలూరు తమ డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే తమ డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటే కరెంటు స్తంభం, దాంతోపాటు విశాలమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు అలాగే ఎల్లప్పుడూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ నిర్విరామంగా వారి కష్టాలను తీర్చే విధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నుండి ప్రత్యేక నిధులు తేవడంతో పాటు కాంగ్రెస్ అధిష్టానం నుండి కూడా తమ డివిజన్ అభివృద్ధి కొరకు ప్రత్యేక తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. కావున ఒకటో నెంబర్ డివిజన్ వాసులు ఈ మున్సిపల్ ఎన్నికల్లో తనను దీవించి గెలిపించాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా నామినేషన్ వేసిన వెంటనే నామినేషన్ కేంద్రం నుండి కాలూరు ఖానాపూర్ వరకు బైక్ ర్యాలీ గుండా తన అనుచరులు కార్యకర్తలతో బయలుదేరి వెళ్లారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >