| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని రుక్మిణికుంట శ్రీరామ్ నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన కట్ట మైసమ్మ బోనాలు, తొట్టెల కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. 

ఈ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి కాలనీ ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. 

అనంతరం కట్ట మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో కామారెడ్డి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలను నెత్తిన పెట్టుకొని అమ్మవారికి సమర్పించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తొట్టెల కార్యక్రమం కూడా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నినాదాలతో శ్రీరామ్ నగర్ కాలనీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగలు ప్రతీకలుగా నిలుస్తాయని, తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రజలందరూ ఐక్యతతో, సోదరభావంతో పండుగలను జరుపుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, స్థానికంగా నిర్వహించే పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తగిన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులతో కామారెడ్డి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమా శ్రీనివాస్, కైలా శ్రీనివాస్ రావు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు మహమ్మద్ ఇలియాస్, ఐరేణి సందీప్, కౌన్సిలర్లు అంజద్, లడ్డు , సత్యం, భాస్కర్ గౌడ్ , స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, శ్రీరామ్ నగర్ కాలనీ ప్రజలు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Next "నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
ADVERTISEMENT