Posted on 2026-01-29 13:21:09
డైలీ భారత్, భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా గణపురం లో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ గురువారం స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సిపి జన్మదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సిపి జన్మదిన సందర్భంగా శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు. సిపి సాయి చైతన్య జన్మదిన సందర్భంగా గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, గణపురం సిఐ కరుణాకర్ రావు, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ఎస్ఐ రేఖ అశోక్ గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్ లు శాలువాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >