| Daily భారత్
Logo




ఫిబ్రవరి 2వ తేదీన ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నవ చండీ యాగం

News

Posted on 2026-01-29 13:22:21

Share: Share


ఫిబ్రవరి 2వ తేదీన ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో నవ చండీ యాగం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన దుబ్బా రోడ్డులోని మున్నూరు కాపు కళ్యాణ మండపం నందు నవచండి యాగం నిర్వహిస్తున్నట్టు ఇందూరు జిల్లా ప్రజలు ఈ కార్యక్రమం లో పాల్గొనాలని సంస్థ అధ్యక్షులు మద్దకూరి సాయిబాబు అన్నారు. లోక కళ్యాణర్ధం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా పాడిపంటలు సమృద్ధిగా పండేలా అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని  చండీ యాగం నిర్వహించటo జరుగుతుందన్నారు అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవ కార్యక్రమాల్లో ముఖ్యమైన సేవ అనాథ శవానికి అంత్యక్రియలు ఇప్పటి వరకూ 157 అనాథ శవాలకి అంత్యక్రియలు పూర్తి చేసినట్టు  తెలిపారు, శాస్త్రాలల్లో చెప్పినట్టు ఒక్క అనాథ శవానికి అంత్యక్రియలు చేస్తే అశ్వమేధ యాగం తో సరిసమానమని ఇప్పటి వరకూ ఇందూరు యువత చేసిన  అంతిమ సంస్కారాలు ఎన్నో యాగాలతో సమానమని అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం 6గంటలకు గణపతి పూజతో మొదలై మండపరదన, శివ పార్వతుల కళ్యాణము , శివ రుద్రబిశేకం, సామూహిక కుంకుమార్చన, చండీ హోమం, పూర్ణాహుతి, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు కావున ఇందూరు జిల్లా ప్రజలందరూ తప్పకుండా  నవ చండీ యాగం లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని  కోరారు. 

ఈ కార్యక్రమoలో  ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, మద్ది గంగాధర్, రాజేష్  శర్మ, యువి ఫౌండేషన్ ఫౌండర్ దొడ్డి సుజన్ కుమార్, కనకయ్యా, రంజిత్ , ఉమేష్ ,దర్శనం రాజు, తదితరులు పాల్గొన్నారు

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >