| Daily భారత్
Logo




ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కి సిట్ నోటీసులు

News

Posted on 2026-01-29 09:33:51

Share: Share


ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కి సిట్ నోటీసులు

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాస సిబ్బందికి నోటీసులు అందజేసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు తెలిపారు.

గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వెళ్లి.. ఆయన ఇంట్లో లేనందున అక్కడి సిబ్బందికి నోటీసులు అందజేశారు. సెక్షన్ సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు కేసీఆర్‌కు జారీ చేశారు. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సిట్ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

మరోవైపు కేసీఆర్ విచారణకు సంబంధించి సిట్ కార్యాలయంలో అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో అడగాల్సిన ప్రశ్నల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ ప్రక్రియను ఎక్కడ నిర్వహించాలి(ఆయన నివాసంలోనా? లేదా సిట్ ఆఫీసులోనా?) అనే అంశాలపై అధికారులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. భద్రతా పరమైన చర్యలు, చట్టపరమైన నిబంధనలపై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >