| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సమ్మక్క సారలమ్మ జాతరకు సాధారణ సెలవులు ప్రకటించాలి : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

సమ్మక్క సారలమ్మ జాతరకు సాధారణ సెలవులు ప్రకటించాలి : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

తెలంగాణ టీచర్స్ యూనియన్(TTU) రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

డైలీ భారత్, సిరిసిల్ల: ఆసియా ఖండంలోనే వైభవంగా జరిగే గొప్ప జాతర, తెలంగాణ కుంభమేళాగా పిలిచే  మేడారం సమ్మక్క సారక్క జాతరకు  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30,31తేదీలలో సాధారణ సెలవులు ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కొండికొప్పుల రవి , దూస మధులు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు..తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఘనంగా జరుపుకునే ఈ జాతర కు తెలంగాణతో పాటు ఒరిస్సా, చత్తీస్గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుండి కూడా ప్రజలు తరలివస్తారని ,సమ్మక్క సారక్కల మొక్కులు చెల్లించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు, పాఠశాల,కళాశాలల విద్యార్థులకు సాధారణ సెలవులు ప్రకటించాలని కోరారు. రెండు సంవత్సరాలకు ఒకసారి ఘనంగా జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించడం ఆనందదాయకం అని తెలిపారు.ఈ జాతరకు సెలవులు ప్రకటిస్తూ మేడారం జాతరని జాతీయ పండుగగా ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

సమ్మక్క సారక్కల పోరాట స్ఫూర్తితో తెలంగాణ సమాజం జాగృతం కావాలని తెలుపుతూ ఆ తల్లులకు వినమ్ర వందనాలు తెలిపారు.

Previous జూలూరుపాడు నుండి పాపకొల్లు రోడ్డు వెడల్పు పెంచాలి
Next ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కి సిట్ నోటీసులు
ADVERTISEMENT