Posted on 2026-01-28 16:12:20
డైలీ భారత్, అనకాపల్లి : జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ మరియు నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి.శ్రీనివాస రావు ఆదేశాల మేరకు జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ ను మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
నాతవరం, డి.యర్రవరం మరియు జిల్లేడిపూడి పరిధిలో పోలీసులు ప్రత్యేక డ్రోన్ నిఘా నిర్వహించారు.
నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, నాతవరం ఎస్సై వై.తారకేశ్వరరావు మరియు సిబ్బంది కలిసి డి.యర్రవరం శివారు ప్రాంతాలలో డ్రోన్ సాయంతో తనిఖీలు చేపట్టారు.
బహిరంగంగా మద్యపానం చేస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల వినియోగాన్ని మరింత పెంచాలని జిల్లా ఎస్పీ గారు అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. బహిరంగ మద్యపానం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం డ్రోన్ల ద్వారా నిఘా ఉంచాలని, ప్రతిరోజూ వీటిని వినియోగించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
#anakapallidistrict
#anakapallipolice
#AndhraPradeshStatePolice
#Andhra Pradesh Police
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >