Posted on 2026-01-27 11:48:15
బోధన్ మండలం అమ్డాపూర్ కస్తూర్బా బాలికల విద్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
ప్రభుత్వ బాలికల వసతి గృహాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
బొర్లం లో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చర్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాలికల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. బొర్లంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
బోధన్ మండలం అమ్దాపూర్ లో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులు ఏ ఒక్కరిని కూడా లోనికి అనుమతించకూడదని, విద్యార్థినులను వారి తల్లిదండ్రులు వస్తేనే వారి వెంట ఇంటికి పంపాలని హితవు పలికారు. తరచూ ఇంటికి వెళ్ళే బాలికల విషయంలో ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు పదేపదే ఎందుకు వెళ్తున్నారు అన్నది క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు. ఇటీవలే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన సంగీత అనే 8వ తరగతి విద్యార్థిని నిర్వాహకుల అజాగ్రత్త వల్ల ప్రమాదం బారిన పడి మృతి చెందిందని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా సంఘటనలకు ఆస్కారం లేకుండా బాలికల భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అంతకుముందు 8వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించి వారి సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా, పాఠశాల చుట్టూ తక్షణమే ప్రహారీ గోడ నిర్మాణం జరిపించాలని, ప్రమాదకరంగా ఉన్న గుంతను పూడ్చి వేయించాలని, విద్యుత్ వైరింగ్ సరి చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్ కేటాయిస్తామని అన్నారు. వంటగది, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్, ఎంఈఓ నాగయ్య, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ హిమబిందు తదితరులు ఉన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >