| Daily భారత్
Logo




రంజాన్ పండుగ ఏర్పాట్లుపై జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ సమీక్ష

News

Posted on 2026-01-24 15:46:28

Share: Share


రంజాన్ పండుగ ఏర్పాట్లుపై జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ సమీక్ష

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో రాబోయే రంజాన్ 2026 పండుగ ఏర్పాట్లు పై జిల్లా అదనపు కలెక్టర్ కె.శ్రీనివాస్ బుధ‌వారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం మరియు ప్రార్థనలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవడానికి అవసరమైన సౌకర్యాలను, పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్, భద్రత, మసీదులు మరియు ప్రజా ప్రదేశాలలో సౌకర్యాలు వంటి తగిన మౌలిక సదుపాయాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. మత పెద్దలు విద్యుత్ సదుపాయము, స్ట్రీట్ లైట్స్, మంచి నీటి సదుపాయము, మరియు వీధి కుక్కలను నియంత్రిచుట లాంటి సమస్యలను పరిష్కారించాలని అదనపు కలెక్టర్ ను కోరారు.అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను మత పెద్దలు సూచించిన పలు అంశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ రెడ్డి, సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ డిసిపి, ఆర్డీఓ సరిత, పోలీసు అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు, సంబంధిత అధికారులు, మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >