| Daily భారత్
Logo




ఇందూరు గడ్డపై కమల వికాసం తథ్యం

News

Posted on 2026-01-22 15:38:32

Share: Share


ఇందూరు గడ్డపై కమల వికాసం తథ్యం

కేంద్ర పథకాలతో సోకులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్లో కమలం వికసిస్తుందని ఇందూరు గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని 43, 52, 28, 51, 14 మరియు 15వ డివిజన్ లలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత భారతదేశం తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని ప్రపంచం లోని అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఆర్థికంగా చతికిలబడిపోయాయని, ఆ దేశాల్లో జీవిస్తున్న ప్రజల ప్రాణాలకు రక్షణ కూడా లేకుండా పోయిందని అన్నారు. మోడీ నాయకత్వంలో ఉన్న భారతదేశం తిరుగులేని శక్తిగా విశ్వగురువుగా ఎదుగుతుందన్నారు. ప్రధాని మోదీ పాలనలో దేశభక్తి ఆధ్యాత్మిక చింతన సనాతన ధర్మం రోజురోజుకు పెరుగుతున్నాయని భారతీయులంతా బిజెపి వైపు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సాధించిన తిరుగులేని విజయమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం, ఇంటింటికి మంచినీరు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు ఇలా ప్రతి పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని, కానీ అంతా తామే చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎఎస్ పార్టీలు రెండూ కూడా కుటుంబ పార్టీలేనని, నిజమైన ప్రజాస్వామ్యంతో నడిచే బిజెపి పార్టీ మాత్రమే సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్ అనే నినాదాలతో పనిచేస్తుందని అన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించినప్పటికీ కేవలం రెండు, మూడు సీట్ల తేడాతో కార్పొరేషన్ సీటు కోల్పోయామని, అనైతిక హక్కులతో మేయర్ పీఠం దక్కించుకున్న ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రభుత్వం నగరానికి చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో బిజెపి తిరుగులేని విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని, నగరాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో పబ్లిక్ హెల్త్ ఏఈ శంకర్ పాల్గొన్నారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >