| Daily భారత్
Logo




ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే : జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ

News

Posted on 2026-01-19 13:17:10

Share: Share


ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం మీదే : జిల్లా మానసిక వైద్యాధికారి డా.రమణ

"ప్రణాళిక బద్ధమైన చదువు విజయానికి మార్గం" అంశంపై మానసిక అవగాహన సదస్సు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మండలం గర్గుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఎక్సైజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో "ప్రణాళిక బద్ధమైన చదువు విజయానికి మార్గం" అనే అంశంపై విద్యార్థులకు మానసిక ఆరోగ్యం పై అవగాహన సదస్సు నిర్వహించినట్లు ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మానసిక వైద్యాధికారి డాక్టర్ రమణ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడే దేనినైనా జయించగలమని ఉద్ఘాటించారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ప్రణాళిక వేసుకొని చదువుకోవాలని, సందేహాలు ఏమైనా ఉంటే తమ ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. పరీక్షా కాలంలో విద్యార్థులకు ఏర్పడే మానసిక సమస్యలు, టీనేజీలో వచ్చే అవరోధాలను అధిగమించేందుకు విద్యార్థులతో చర్చించారు. ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని అటువంటిప్పుడే విద్యార్థులు చదువుపై ఇష్టంతో మార్కులు సంపాదిస్తారన్నారు. మార్కులు తక్కువ వచ్చాయని ఫెయిల్ అయ్యా మను మానసిక చింతను దరిచేరనీయరాదని, ఎటువంటి మానసిక సమస్యలు తలెత్తిన తమను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఎక్సైజ్ ఎస్సై విక్రం కుమార్ మాట్లాడుతూ.. టీనేజ్లో విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసవ్వడం గత కొంతకాలంగా చూస్తున్నట్లు ఇప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో విద్యార్థులు చెడు వ్యసనాలకు దగ్గరయ్యే అవకాశం ఉండడంతో వాటి జోలికి వెళ్లకుండా ఉండేందుకు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను విద్యార్థులకు వివరించారు. తమ ఇళ్లల్లో కానీ తమ చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ గ్రామాల్లో మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగించిన కలిగి ఉన్న తమకు సమాచారాన్ని చేరవేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు కష్టపడి చదివి క్రమశిక్షణాహితంగా ఉంటూ విజయాలను సొంతం చేసుకోవాలని సూచించారు. మానసిక సమస్యలు తలెత్తితే 14416ని, డ్రగ్స్ సంబంధిత సమాచారం తెలిస్తే 14446 ని సంప్రదించాలని  తమ వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా సోషల్ వర్కర్ డా.రాహుల్ కుమార్ తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >