| Daily భారత్
Logo




వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష

News

Posted on 2026-01-08 17:40:11

Share: Share


వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్ష

డైలీ భారత్, కరీంనగర్:జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో గల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆలయ చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులతో సమీక్షించారు.

 వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై  గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, షామియానాకు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని,ఆహార వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

భక్తుల రద్దీ దృష్యా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ట్రాఫిక్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, మున్సిపల్ తదితర విభాగాలు సమన్వయంతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పేర్కొన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి బారికేడ్లతో బందోబస్తు నిర్వహించాలన్నారు. స్టేజి, లైటింగ్, సౌండ్, డెకరేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.   

 సమావేశంలో ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఈవో సుధాకర్  ఆలయ అర్చకులు నాగరాజు పాల్గొన్నారు.


#karimnagar 

Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >
Image 1

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

Posted On 2026-07-26 17:19:21

Readmore >
Image 1

సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు

Posted On 2026-07-26 16:55:36

Readmore >
Image 1

బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు

Posted On 2026-07-26 16:52:48

Readmore >
Image 1

28న "ఛలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Posted On 2026-07-26 16:51:12

Readmore >