| Daily భారత్
Logo




సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టి అతడి వస్తువులను దోచుకున్న ఆటో డ్రైవర్

News

Posted on 2026-01-08 16:32:08

Share: Share


సెక్యూరిటీ గార్డును తీవ్రంగా కొట్టి అతడి వస్తువులను దోచుకున్న ఆటో డ్రైవర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీకి పాల్పడిన ఒక ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బాలానగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) సక్రమ్ తెలిపారు. వృద్ధుడైన సెక్యూరిటీ గార్డును భయపెట్టి, తీవ్రంగా కొట్టి అతడి వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నట్లు ఆయన వివరించారు.ఈ నెల 6వ తేదీన బాలానగర్, గౌతమ్ నగర్‌కు చెందిన రచ్చన్న (60) అనే సెక్యూరిటీ గార్డు, మంగళవారం ఉదయం నర్సాపూర్ చౌరస్తా నుంచి సనత్ నగర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లడానికి ఆటో ఎక్కారు. ఈ సమయంలో, సోమల మల్లికార్జున్ అనే ఆటో డ్రైవర్ అతడిని తన ఆటోలో ఎక్కించుకున్నాడు.బాలానగర్ పరిధిలోని వరుణ్ మోటార్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలోకి వెళ్లగానే, నిందితుడైన ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆటోను ఆపాడు. రచ్చన్నను భయభ్రాంతులకు గురిచేసి, అతడి వద్ద ఉన్న రూ. 300 నగదు, సెల్ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నాడు. అడ్డుకోబోయిన రచ్చన్నను అత్యంత క్రూరంగా కొట్టడంతో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.దీంతో బాధితుడు రచ్చన్న బాలానగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో ఆటో డ్రైవర్ సోమల మల్లికార్జున్‌ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు డీఐ సక్రమ్ తెలిపారు.

Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >
Image 1

కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైంది..

Posted On 2026-07-27 06:48:26

Readmore >
Image 1

ఎంపల్లి.పద్మా రెడ్డి పై కేసు నమోదు

Posted On 2026-07-27 04:38:19

Readmore >
Image 1

ఘనంగా పాపకొల్లు భీమ్లా తండ గ్రామంలో తీజ్ పండుగ

Posted On 2026-07-26 18:58:50

Readmore >