| Daily భారత్
Logo




విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

News

Posted on 2026-01-07 11:26:28

Share: Share


విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విద్యలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు : జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

సైబర్ నేరాల పట్ల విద్యార్థి దశ నుండే చైతన్యం అవసరం

ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి చదివితేనే విజయాలు సాధ్యమవుతాయి.

డైలీ భారత్, ముస్తాబాద్: ముస్తాబద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ వారి సౌజన్యంతో ముస్తాబద్ మండల పరిధిలోని జడ్పీ ఎచ్ఎస్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వైద్య శిబిరానికి విద్యార్థుల నుండి విశేష స్పందన లభించగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య సమస్యలపై వైద్య నిపుణులు విద్యార్థులకు పలు సూచనలు చేయడం జరిగింది.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...

విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.చిన్న వయస్సులోనే ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరమని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో కష్టపడి చదివితేనే జీవితంలో విజయాలు సాధ్యమవుతాయని,చదువుతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ అలవర్చుకోవాలని హితవు పలికారు.

ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మోసాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ ల ద్వారా మోసం చేస్తున్నరని, వాటిపట్ల అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు సామజిక మాధ్యమాల్లో అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత విషయాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకువద్దని తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులలకు, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సైబర్ నేరాలకు మోసపోయిన వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి.కాల్ చేసి ఫిర్యాదులను చేయాలన్నారు. సైబర్ నేరాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని మోసపోయిన వెంటనే గ్రహించి ఫిర్యాదు చేసిన యెడల, మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 

ప్రస్తుత కాలంలో విద్యార్థులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు బ్లెడ్ సమస్య మరియు కంటి సమస్యలు.ఈనేపథ్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో విద్యార్థులకు సాధారణ వైద్య పరీక్షలు,కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సూచనలు అందించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ యాజమాన్యంతో పాటు ఇందులో పాల్గొన్న వైద్య నిపుణులు , సిబ్బందికి , సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది,జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సి.ఐ మొగిలి,Meo రాజిరెడ్డి,ఎస్.ఐ గణేష్, డాక్టర్లు చంద్రశేఖర్ రావు, శ్రీకాంత్ , అనురాధ, స్రవంతి, సురభి వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >