| Daily భారత్
Logo




జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

News

Posted on 2026-01-06 14:37:16

Share: Share


జిల్లా పోలీసు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ పరిశీలించిన జిల్లా ఎస్పీ

సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఈ-చాలన్ విధింపు

నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరం 

 డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్‌ను జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ సందర్శించి, సిబ్బంది ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఏ విధంగా ఈ-చాలన్లు విధిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో నేరాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలన్నింటిని జిల్లా పోలీసు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని గుర్తించి, ఈ-చాలన్ల ద్వారా జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు.

సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలోనే కాకుండా నిందితుల గుర్తింపులో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ గారు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లైసెన్స్ లేకుండా, నంబర్ ప్లేట్ సక్రమంగా లేకుండా, నంబర్ ట్యాంపరింగ్ చేసిన లేదా నంబర్ తుడిపివేసిన వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, పట్టుబడిన వాహనాలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాలు, మరణాలు మరియు క్షతగాత్రుల సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా, గౌరవ ఉన్నత న్యాయస్థానాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి NH-44 (బిక్కనూర్ నుంచి దగ్గి అటవీ ప్రాంతం – కామారెడ్డి జిల్లా పరిధిలో) వేగ పరిమితిని 80 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు తెలిపారు. పరిమితికి మించి వేగంగా వాహనాలు నడిపితే తప్పనిసరిగా జరిమానాలు విధించబడతాయని స్పష్టం చేశారు

ఇకపై ప్రతి వాహనదారుడు స్వచ్ఛందంగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ, వేగ పరిమితిని మించకుండా ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని కోరారు. ఇలా చేయడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారమవుతామని జిల్లా ఎస్పీ తెలియజేశారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >