| Daily భారత్
Logo




కాంగ్రెస్ నాయకులను దూషించే అర్హత కేటీఆర్ కు లేదు

News

Posted on 2026-01-05 12:19:50

Share: Share


కాంగ్రెస్ నాయకులను దూషించే అర్హత కేటీఆర్ కు లేదు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం హామలుచేస్తుంది

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో సోమవారం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షులు కట్పల్లి నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్  పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయిన రాహుల్ గాంధీని,ముఖ్యమంత్రిని అవమానించే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ని కేటిఆర్ అవమానించడం అంటే ఆది కేటీఆర్ అవివేకానికి,అహంకారానికి నిదర్శనం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదు అని కేటీఆర్ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని,గతంలో బీఆర్ఎస్  అధికారంలో రాకముందు దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, ప్రతి పేదవానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్నారు తప్ప ఏ ఒక్కరికి కూడా లబ్ధి చేకూర్చలేదు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి హామీని నెరవేరుస్తుంది అని అన్నారు. కేటీఆర్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి  పైన అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయి లేదు అని, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు . ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కేవలం ఫామ్ హౌస్ లోనే ఉంటూ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరైనది కాదు అని, ప్రజలలో ఉంటేనే ప్రభుత్వం పని చేస్తుందో చేయట్లేదో తెలుస్తుంది అని, ఇటీవల కెసిఆర్ అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్లి మరి కరచాలనం చేసి మాట్లాడడం జరిగిందని ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి నిదర్శనమని, కానీ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిలబడని కేటీఆర్ ఎలాంటి సాంస్కృతి అలవాటు చేసుకున్నాడు ప్రజలందరూ గమనించారని కేటీఆర్ కేవలం అహంకార ధోరణితో మాత్రమే ఆలోచిస్తున్నాడని అన్నారు. మరొకసారి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వాక్యాలు చేస్తే టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి, ప్రచార కమిటీ సభ్యులు జావిద్ అక్రమ్, సేవదల అధ్యక్షులు సంతోష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణు రాజ్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి, వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి, రాజేందర్, శోభన్, కౌశిక్, దేగం గంగారెడ్డి, గణేష్  తదితరులు పాల్గొన్నారు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >